పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు 14ఏళ్లు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం
అమరావతి: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్,, ఆయన సతీమణి బుష్రా బీబీకి, ఆల్-ఖాదిర్ ట్రస్ట్ భూ ఆక్రమణ కేసులో శుక్రవారం న్యాయస్థానం శిక్షను విధించింది..ఇమ్రాఖాన్ కు 14 సంవత్సరాలు,,ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి 7 సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తూ రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా తీర్పునిచ్చారు..అలాగే ఇమ్రాన్ కు రూ.10లక్షలు, బుష్రాకు రూ.5 లక్షలు జరిమానా కూడా విధించారు..ఇమ్రాన్ ఖాన్ అధికారంలో వున్న సమయంలో భూముల అవినీతి కేసులో 2023 ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఉంటున్నాడు.. కోర్టు డిసెంబర్ 2024లో తీర్పును రిజర్వు చేసింది..తుదితీర్పును నేడు కోర్టు వెలువరించింది..తీర్పు వెలువడిన వెంటనే ఇమ్రాన్ సతీమణి బుష్రా బీబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.