అంతరిక్ష పేలిపోయిన స్పేస్‌ఎక్స్ రాకెట్-ఎలాన్ మస్క్ కు ఎదురుదెబ్బ
అమరావతి: అంతరిక్ష రంగంలో క్రమేపి పురోగతి సాధిస్తున్న టెస్లాఅధినేత ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ (రీ యూజింగ్) పునర్వినియోగ రాకెట్ స్టార్‌షిప్ పేలిపోయింది..టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా గురువారం సాయంత్రం 4.37 గంటలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 4 గంటలకు) ఈ రాకెట్‌ను ప్రయోగించారు..కరేబియన్ సముద్రం మీదుగా భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు సాంకేతిక లోపం తలెత్తడంతో భారీ మంటలు వచ్చి రాకెట్ పేలిపోగా,, బూస్టర్ మాత్రం క్షేమంగా లాంచ్ ప్యాడ్‌కి తిరిగి చేరుకుంది..
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. రాకెట్ పేలిపోవడంపై స్పేస్ ఎక్స్ టీమ్ స్పందిస్తూ,, ప్రయోగం విఫలమవడానికి సంబంధించి ముఖ్యమైన సంకేతిక సమాచారాన్ని సేకరిస్తున్నామని వెల్లడించింది..ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది..ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన ఎనిమిది నిమిషాల తరువాత స్టార్ షిప్ రాకెట్‌తో గ్రౌండ్ కంట్రోల్ తో కమ్యూనికేషన్ కోల్పోయామని స్పేస్ ఎక్స్ కమ్యూనికేషన్స్ మేనేజర్ డాన్ హుట్ వెల్లడించారు..232 అడుగుల భారీ రాకెట్ అయిన స్టార్‌షిప్‌లో మొత్తం 33 రాప్టర్ ఇంజిన్లు వాడారు.