AGRICULTUREAP&TGBUSINESSCRIMEDEVOTIONALDISTRICTSEDU&JOBSHEALTHNATIONALPOLITICSTECHNOLOGYWORLD

రాష్ట్రంలో భారీ సంఖ్యలో IAS అధికారుల బదిలీలు

అమరావతి: రాష్ట్రంలో 19 మంది IASలు,,2 IPS అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు..IASలతో పాటు మరో ఇద్దరు IPS అధికారులను కూడా బదిలీ చేశారు.. అనంతరామును అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా,, ఆర్‌.పి.సిసోడియాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది..జి.జయలక్ష్మికి CCLA చీఫ్‌ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది..కాంతిలాల్‌ దండే R&B ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు..సురేశ్‌ కుమార్‌ ను పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి,, గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు అలాగే GAD కార్యదర్శిగానూ సురేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.. ఢిల్లీరావు వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది..సౌరభ్‌ గౌర్‌ ITశాఖ,RTGS కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.. వినయ్‌చంద్‌ పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.. యువరాజ్‌ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ కార్యదర్శి గా,, హర్షవర్ధన్‌ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.. విజయరామరాజు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది.. కె.కన్నబాబు సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గానూ బాధ్యతలు అప్పగించింది..హిమాంశు శుక్లా సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్‌ గా నియమించింది.. వివేక్ యాదవ్‌ ను యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శిగా నియమించింది..పి.భాస్కర్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి, EWS,GAD సర్వీసెస్‌ అదనపు బాధ్యతలు అప్పగించింది.. సూర్యకుమారి మహిళా, శిశుసంక్షేమం, దివ్వాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.. సి.శ్రీధర్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది.. జె.నివాస్‌ ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది.. వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.. హరీశ్‌కుమార్‌ గుప్తా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌ డీజీగా బదిలీ చేసింది.. కుమార్‌ విశ్వజిత్‌ హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది.. గిరిజాశంకర్‌ ను ఆర్థికశాఖ నుంచి రిలీవ్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *