విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు-కేంద్ర మంత్రి కుమారస్వామి
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందన్న విషయం అర్థమైందని,,అలాగే ప్లాంట్‌పై అనేక వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అని కేంద్ర పరిశ్రమలు,ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి అన్నారు.. విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసే కార్మికులు, దీని అవసరాలపై ఉన్న ప్రాధాన్యతను తాను గుర్తించానని మంత్రి అన్నారు..గురువారం కేంద్ర మంత్రి స్వయంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిశీలించారు..అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కుప్లాంట్‌ను పరిరక్షించడం తమ బాధ్యత అన్నారు.. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని,,ప్రధాని మోదీ అశీస్సులతో ప్లాంట్ వందశాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందని భరోసా ఇచ్చారు..ఈ మేరకు విజిటర్స్ బుక్‌లో తన అభిప్రాయాన్ని కేంద్రమంత్రి కుమారస్వామి తెలియజేశారు..ప్రధానమంత్రి సహకారంతో ఈ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో దేశ ప్రయోజనం కోసం తీర్చిదిద్దే విధంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు..ఉక్కు ప్లాంట్ సీఎండీ అతుల్ బట్ సహా వివిధ డిపార్ట్ మెంట్ హెడ్స్ తో ఆయన స్టీల్ ప్లాంట్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు..మీడియా అడిగిన ఒక ప్రశ్నపై స్పందిస్తూ “విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తారని ఎవరు చెప్పారు” ? ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు.. అందుకే నేను ఇక్కడికి వచ్చాను.. ఈ విషయం చెప్పడానికి ముందు ప్రధాని అనుమతి తీసుకోవాల్సి ఉంది..RINLకు సంబంధించిన విషయాలన్నీ ప్రధానికి నివేదించి ఆయన్ను ఒప్పించాలి.. ఇప్పటికే ఈ విషయాలన్నింటిపై అధికారులతో చర్చించి ఓ నోట్ తయారుచేస్తున్నాం.. RINLను తిరిగి పట్టాలు ఎక్కించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం..ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నామని కుమారస్వామి తెలిపారు.