కమిషనర్ వికాస్ మర్మత్ కు ఘనంగా వీడ్కోలు
నెల్లూరు: నగర పాలక సంస్థ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన వికాస్ మర్మత్, కు కార్యాలయం సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం జరిగిన ఆత్మీయ అభినందన వీడ్కోలు కార్యక్రమంలో కమిషనర్ వికాస్ మర్మత్ ను నగర పాలకసంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా అభినందించారు.గడచిన 15 నెలల కాలంలో కమిషనర్ గా ఆయన చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంస్కరణలు అభినందనీయం అని పలువురు ప్రశంసించారు. భవిష్యత్తులో తిరిగి నెల్లూరు జిల్లా కలెక్టర్ గా వికాస్ మర్మత్ బాధ్యతలు స్వీకరించాలని ఆకాంక్షించారు.