రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” సినిమాకు టికెట్ రేట్లు పెంపుకు అనుమతులు
అమరావతి: రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అలాగే బెనిఫిట్ షోలకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది..G.O Ms No-13 ప్రకారం జనవరి 10వ తేదీన ఉదయం 1 గంటకు నిర్వహించే బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలుగా విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చారు..అలాగే రిలీజ్ రోజు జనవరి 10వ తేదిన ఆరు షోలకు అనుమతితో పాటు అదే రోజు ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు కూడా అనుమతి ఇచ్చారు..జనవరి 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మల్టిప్లెక్స్ లలో అదనంగా 175 రూపాయలు,, సింగిల్ థియేటర్లలో 135 రూపాయలు పెంచుకునేలా అనుమతులు,,రెండు వారాలు పాటు 5 షోలకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. జనవరి 10న ఉదయం 1 గంట షోకు 600 రూపాయలు టికెట్ ధర,, రెండు వారల పాటు మల్టీ ఫ్లెక్స్ లో 352 రూపాయలు,, సింగిల్ థియేటర్స్ లో 282 రూపాయలు టికెట్ ధర వుండవచ్చు..రెండు వారాల తరువాత టిక్కెట్ ధరలు మాములు రేట్లు ఉంటాయి..