సూపర్‌స్టార్ రజనీకాంత్ కు అస్వస్థత-ఆసుపత్రికి తరలింపు
అమరావతి: సూపర్‌స్టార్ రజనీకాంత్ (73) సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆసుత్రికి తరలించారు.. కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీశ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం సూపర్‌స్టార్‌కు చికిత్స అందిస్తున్నదని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు..మంగళవారం సాయంత్రంకు అయనను కార్డియాక్ ఐసీయూ నుంచి వార్డుకు తరలించే అవకాశం ఉన్నదని డాక్టర్లు తెలిపారు.. అతను డిశ్చార్జ్ అయ్యే ముందు కోలుకోవడానికి రాబోయే 2-3 రోజులు ఆసుపత్రిలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి..