ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా విజయవాడ- శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా విజయవాడ- శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది..శుక్రవారం మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి టేకాఫ్ అయిన ‘సీ ప్లేన్’ శ్రీశైలం జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది..శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్ చేరుకుంది.. శనివారం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీ ప్లెయిన్‌లో ప్రయాణం చేయనున్నారు.. దేశంలో తొలిసారి కమర్షిల్ ‘సీ ప్లేన్’ సర్వీసులను జూన్ 2వ తేది 2013లో కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో ప్రారంభం అయింది..రెండవ ‘సీ ప్లేన్’ సర్వీసులు అక్టోబరు 2020లో అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి గుజరాత్‌లోని కెవాడియాలో స్టాట్యూ ఆఫ్ యూనిటీకి ప్రారంభం అయ్యాయి..అయితే కోవిడ్ కారణంగా తాత్కలికంగా సర్వీసులు రద్దు చేశారు.