సీ.ఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
అమరావతి: ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు సోదరుడు, రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు.. శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు..గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు..సోదరుడి మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు..రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం నాడు ఆయన స్వగ్రామమైన నారావారిపల్లెలో నిర్వహించనున్నట్లు అయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.