పేద ముస్లింలకు వక్ఫ్ ప్రయోజనాలు చేరేలా చూడాలి-పవన్ కళ్యాణ్
వక్ఫ్ బోర్డు సవరణలు..
అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఆమోదం పొందడం కేవలం పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ అని,,ఇది న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం వైపు చారిత్రాత్మక అడుగు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా పేర్కొన్నారు..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో,, ఎన్డీయే పరిపాలన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తన నిబద్ధతను మరోసారి నిరూపించుకుందన్నారు.. సంవత్సరాలుగా, వక్ఫ్ బోర్డుల కార్యకలాపాల గురించి తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయన్నారు.. వక్ఫ్ బోర్డు సవాళ్లను పరిష్కరించడం, పారదర్శకతను పెంచడం, పేద ముస్లింలకు వక్ఫ్ ప్రయోజనాలు చేరేలా చూడటం,, ముస్లిం మహిళలకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం ఈ సవరణ ఒక ముఖ్యమైన అడుగు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు..
ఈ బిల్లుపై ఏకపక్ష నిర్ణయం కాకుండా, బిల్లుపై లోక్‌సభలో దాదాపు 12 గంటలు, రాజ్యసభలో దాదాపు 14 గంటలు పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయని, ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించారని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు..బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఇలా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టడంలో.. మార్గనిర్దేశం చేయడంలో నాయకత్వం వహించినందుకు పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల సంక్షేమ మంత్రి కిరణ్ రిజిజు, హోం మంత్రి అమిత్ షా… రాజ్యసభలో ఎన్డీయే నాయకుడు జేపీ నడ్డాలకు, అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.. ఈ సంస్కరణకు మద్దతు ఇచ్చిన ప్రతి ఎంపీకి, అలాగే వారికి మద్దతు ఇచ్చిన ముస్లిం సమాజానికి కూడా తాను కృతజ్ఞతలు తెలియజేసినట్లు వెల్లడించారు.