లోక్‌సభ నిరవధికంగా వాయిదా
అమరావతి: లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు శుక్రవారం ప్రకటించారు.. జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో 16 బిల్లులు ఆమోదం పొందటంతోపాటు సభ 118 శాతం పనిచేసినట్లు వెల్లడించారు..ఆర్థిక బిల్లుతో సహా వివిధ మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లకు లోక్‌సభ ఆమోదంతో బడ్జెట్ ప్రక్రియ పూర్తయింది..రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్ బడ్జెట్‌కు కూడా లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.. అధికార ప్రతిపక్షాల ఢీ అంటే ఢీ అన్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుదీర్ఘ చర్చ తరువాత లోక్‌సభ,,రాజ్యసభలో ఆమోదం పొందింది.