ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.రఘురామకృష్ణరాజు
ముక్కు సూటిగా మాట్లాడితే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె. రఘురామకృష్ణరాజు గురువారం బాధ్యతలు చేపట్టారు.. సభాపతి అయ్యన్నపాత్రుడు,,ముఖ్యమంత్రి చంద్రబాబు,,ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శాసనసభలో ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.ఈ సందర్బంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని హింసిస్తూ ఆ దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా గత ముఖ్యమంత్రి చూసి ఆనందించాడంటే నాకు నమ్మకం కలగలేదన్నారు..తనను జైల్లో పెట్టినప్పుడు కూడా అక్కడ సీసీ టీవీలు ఉండటం చూసాక నమ్మాల్సివచ్చిందని తెలిపారు..అసలు ఇలాంటి దుర్మార్గులు ప్రపంచ చరిత్రలో ఉన్నారా అని వాకబు చేస్తే ఒక్కడున్నాడు,,అతనే పాబ్లో ఎస్కోబార్ అని,,ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ఎస్కోబార్ మాజీ సీ.ఎం అని వ్యాఖ్యనించారు.