మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం
అమరావతి: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఎన్డీయే అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేవ్ కూటమి నాయకులు ప్రచార నిర్వహించనున్నారు..రాష్ట్ర నుంచి సీఎం చంద్రబాబు,,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు మహారాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు..ప్రచారం క్రమంలో బాగంగా ఆయన 5 సభలు, 2 రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు.. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది..16వ తేదీన నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో,,అటు తరువాత లాతూర్ లో మరో బహిరంగ సభలో పాల్గొంటారు.. సాయంత్రం షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పవన్ పాల్గొంటారు..17వ తేదీన చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు..సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్ షోలో పాల్గొని, అనంతరం కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు.