AGRICULTUREAP&TGOTHERS

గాడిద పాలు లీటరు రూ.1600 కొనుగొలు చేస్తాం ? దాదాపు రూ.100 కోట్ల స్కామ్

డాంకీ ప్యాలెస్..

హైదరాబాద్: గాడిద పాలు రోజు క్రమం తప్పకుండా తమకు సప్లయ్ చేస్తే,లీటరు రూ.1600 కొనుగొలు చేస్తామని చెప్పి,,తమను గాడిదలు చేశారని బాధిత రైతులు వాపోయారు..శుక్రవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత రైతులు తమకు జరిగిన మోసం గురించి తెలిపారు.. వివరాల్లోకి వెళ్లితే…. చైన్నైలోని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులు తమను నమ్మించి లొకల్ గా దొరికే గాడిదలు కాకుండా,గుజరాత్ లో దొరికే గాడిద పాలే శ్రేష్టమని,,వాటినే మాకు అమ్మేరని,,వారి వద్ద నుంచి ఒక్కో పాడి గాడిదను రూ.80వేల నుంచి రూ.1.50లక్షల చొప్పున విక్రయించారని,, ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు రూ.1600 చొప్పున కంపెనీ సేకరిస్తుందని ఒప్పందం చేసుకున్నారన్నారు..ఇలా దాదాపు 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారని,, కానీ గత 18 నెలలుగా డాంకీ ప్యాలెస్‌కు సరఫరా చేసిన పాల డబ్బులు,,నిర్వహణ ఖర్చులు,,షెడ్‌ నిర్మాణం,,సిబ్బంది జీతాలు,, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదని బాధితులు వెల్లడించారు..

నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోతే ఏమిటని ప్రశ్నిస్తే ఒక్కొక్కరికీ రూ.15 లక్షల నుంచి రూ.70లక్షల వరకు బ్యాంకు చెక్కులు రాసిచ్చారని తెలిపారు..వాటిని బ్యాంకులో వేస్తే బౌన్స్‌ అయ్యాయని,,దింతో జరిగిన  మోసం ఆర్దం అయిందన్నారు..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు తమలాగా రూ.100 కోట్ల వరకు నష్టపోయారని వారు తెలుపారు..ఇదో పెద్ద కుంభకోణమని దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం వుందని ఆరోపించారు..ఈ ఫ్రాంచెజ్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ విష్ణు వేణుగోపాల్,, (FSSAI) డైరెక్టర్ అమిత్ పాల్గొన్నారని,,దింతో తమకు ఏ మాత్రం అనుమానం రాలేదన్నారు..ఈ విషయంపై చెన్నై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితులు వివరించారు..ఒప్పందం సందర్భంగా ఇచ్చిన GST NO,,FSSAI  లైసెన్స్‌ కూడా నకిలీవేనని తేలిందన్నారు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *