రైల్వే టిక్కెట్‌ల రిజర్వేషన్ వ్యవధి 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించిన రైల్వే శాఖ
అమరావతి: రైల్వే టిక్కెట్‌ల ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూన్నట్లు రైల్వే శాఖ తెలిపింది.. ఇది నవంబర్ 1వ తేది నుంచి అమలులోకి వస్తుంది..ఈ మేరకు IRCTC నిబంధనల్లో మార్పులు చేసింది..భారతీయ రైల్వే తన సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది..టికెట్లను ఇప్పటికే బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి సమస్యా ఉండదు.. ఈ నెల 31 వరకు బుకింగ్ చేసుకునే వారికి ఇంతకు ముందు ఉన్న నిబంధనలే వర్తిస్తాయి.. గతంలో ప్రయాణికులు 60 రోజుల ముందే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేది..ఆ నిబంధనలను తొలుత 90 రోజులకు మళ్లీ 120 రోజులకు పెంచారు.. ఇప్పుడు మళ్లీ పాత నిబంధననే తీసుకొచ్చారు..కొత్త విధానం రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని రైళ్ళకు వర్తించనుంది.. అన్ని తరగతులకు ఇదే విధానం వర్తిస్తుంది..నాన్ ఏసీతో పాటు ఏసీ తరగతుల్లో రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులు ప్రయాణ తేదీ కంటే 60 రోజుల ముందుగా మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలరు..