సిబీఐ దాడుల్లో పట్టుబడిన రైల్వే ఇంజనీర్లు-4 కోట్ల బంగారం,నగదు స్వాధీనం
అమరావతి: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబీఐ) ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.. వీరిలో సీనియర్ DEE,SEEలు నార్త్ రైల్వే, DRM ఆఫీస్ లో సీనియర్ ఇంజనీర్లుగా,మరో వ్యక్తి అఫీసులో మరో సెక్షన్ లో పనిచేస్తున్నారు..ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి, అతని కుటుంబానికి అనుకూలంగా కంట్రాక్టు ఇప్పించేందుకు లంచం డిమాండ్ చేశారు..లంచం విషయంపై సదరు కాంట్రాక్టర్,సిబీకి సమాచారం ఇచ్చారు..సోమవారం సదరు ఇంజినీర్లు, కాంట్రాక్టర్ నుంచి రూ.7 లక్షల లంచం తీసుకున్న వెంటనే సిద్దంగా వున్న సిబీఐ అధికారులు దాడులు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు..సిబీఐ అధికారులు, ఇంజనీర్లకు సంబంధించిన న్యూఢిల్లీలోని ఒక ఇంటిలో సోదాల చేయడంతో దాదాపు రూ.63.85 లక్షల నగదు, రూ.3.46 కోట్ల విలువైన బంగారు కడ్డీలు, ఆభరణాలు పట్టుబడ్డాయి..నగదు,బంగారంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన సిబీఐ అధికారులు,దర్యాప్తు ప్రారంభించారు.