NATIONALOTHERSTECHNOLOGY

అమెరికా అంక్షలు భారత్ ను నిలవరించలేవు-స్వదేశీ పరిజ్ఞానంతో ‘అస్మి’ మెషీన్ పిస్టల్

అమరావతి: అమెరికా,భారతదేశంపై ఎప్పుడైతే అంక్షలు విధిస్తొందొ,అప్పుడే భారత్ తన సాంకేతిక శక్తిని చాటి చెపుతొంది..ఇందుకు ఉదాహరణ గతంలో క్రయోజనిక్ ఇంజన్లలను భారత్,రష్యా నుంచి కొనుగొలు చేయకుండా ఆంక్షాలు విధించింది..దింతో భారతదేశ శాస్త్రవేత్తలు దిన్ని ఒక సవాల్ గా తీసుకుని స్వదేశీ పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్లలను రూపొందించుకుంది.. ఇటీవల భారత్ కు చెందిన అయుధాల తయారీ కంపెనీ,రష్యాకు అయుధాలను సరఫరా చేస్తుందంటూ,సదరు కంపెనీపై అంక్షలు విధించింది..అమెరికా అంక్షలు విధించిన రెండు వారాల వ్యవధిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘అస్మి’ (ASMI) మెషీన్ పిస్టల్ ను ప్రదర్శించింది..ఇలాంటి మెషీన్ పిస్టల్స్, అమెరికా, ఇజ్రాయిల్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో వారి సైనికులు వాడుతుంటారు..వాటికి థీటుగా. ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో భారత సైన్యానికి చెందిన కల్నల్ ప్రసాద్ బన్సోద్ ఈ ఆయుధాన్ని అభివృద్ధి చేశారు.. హైదరాబాద్‌కు చెందిన లోకేష్ మెషిన్ కంపెనీ దీన్ని తయారు చేస్తోంది..

ఆర్మీ తన నార్తర్న్ కమాండ్‌లో 550 ‘అస్మి’ మెషిన్ పిస్టల్స్‌ను చేర్చింది. జమ్ము-కాశ్మీర్ సహా అనేక సమస్యాత్మక సరిహద్దుల బాధ్యతల్ని పర్యవేక్షించే నార్తర్న్ కమాండ్ నిత్యం ఉగ్రవాదులతో పోరాటం చేస్తుంటది..ఈ క్రమంలో వారికి ఈ ఆయుధం మరింత బలాన్ని ఇస్తుంది.. ASMI’ మెషిన్ పిస్టల్ ఒక దృఢమైన,,కాంపాక్ట్ ఆయుధంగా, షార్ట్ రేంజ్ షూటింగ్‌లో ఇది చాలా ఉపయోగకరంగా వుంటుంది..ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగే ఆపరేషన్లకు ఇలాంటి చిన్న మెషిన్ పిస్టల్స్ ఎంతో అనువుగా వుంటుంది..ఇది 100 మీటర్లల్లో వున్న లక్ష్యంను ఖచ్చితంగా చేధిస్తుంది..దీని హై-కెపాసిటీ మ్యాగజీన్‌లో 33 బుల్లెట్లను లోడ్ చేయవచ్చు..టెలిస్కోప్,,లేజర్ లైట్,, బైనాక్యులర్‌లను దానిపై సులభంగా అమర్చవచ్చు..కమెండో ఆపరేషన్లను ఇది మరింత సులభం చేస్తుంది..ఈ మెషిన్ పిస్టల్ యొక్క లోడింగ్ స్విచ్ రెండు వైపులా ఉంటుంది..దింతో ఎడమచేతివాటం జవాన్లు కూడా దీన్ని ఉపయోగించవచ్చు.. దీని ప్రత్యేకమైన సెమీ-బుల్‌పప్ డిజైన్ కారణంగా పిస్టల్ మాదిరిగానూ ఉపయోగించవచ్చు,, అవసరమైతే సబ్‌మెషిన్ గన్‌గా మార్చుకుని ఒకే చేతితో కాల్పులు జరపవచ్చు..యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో నిమగ్నమయ్యే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG), అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) బలగాలకు ఈ ఆయుధం ఉపయుక్తంగా మారనుంది.. మెషిన్ పిస్టల్‌కి ఉన్న 8 ఇంచ్స్ బట్ మడుచుకునే వెసులుబాటు కారణంగా ఆయుధం పరిమాణాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు..ఈ వెసులు బాటు వల్ల భుజంపై పెట్టుకుని రైఫిల్ మాదిరిగానూ ఉపయోగించవచ్చు లేదా ఒక చేతితో ఉపయోగించే పిస్టల్ మాదిరిగానూ మార్చుకోవచ్చు.. నార్తర్న్ కమాండ్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిర్వహించే ఆపరేషన్లకు ఇది ఒక ఉత్తమ ఆయుధంగా మారుతుందని సైనికవర్గాలు భావిస్తున్నాయి..

అస్మి మెషీన్ పిస్టళ్లు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి..1983లో హైదరాబాద్‌లో ఏర్పాటైన ‘లోకేష్ మెషీన్స్ లిమిటెడ్’ సంస్థ వీటిని తయారు చేస్తోంది.. అయితే ఈ సంస్థ తయారు చేస్తున్న మెషీన్ టూల్స్ రష్యాకు ఎగుమతి అవుతున్నాయన్న కారణంగా అమెరికా ఆంక్షలు విధించడంతో లోకేష్ మెషీన్స్ లిమిటెడ్ వార్తల్లో నిలిచింది.. అమెరికా ఆంక్షలు విధించిన కొద్ది రోజుల్లోనే ఇండియన్ ఆర్మీ అస్మి (ASMI) మెషీన్ పిస్టళ్లను సమకూర్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది..దింతో రూ.4.26 కోట్ల విలువైన ఆర్డర్‌ను లోకేష్ మెషీన్స్ లిమిటెడ్ సంస్థ పొందింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *