కర్ణాటక అటవీ శాఖ మంత్రితో సమావేశంమైన పవన్ కళ్యాణ్
అమరావతి: కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి,, అటవీ సంరక్షణ,,ఎర్రచందనం లాంటి 7 అంశాలపై చర్చించేందుకు కర్ణాటకకు రావడం జరిగిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. గురువారం బెంగుళూరులో కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు..అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పరిధిలో, పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయ,,అలాగే ప్రాణ హాని కూడా కలిగిస్తున్నాయని తెలిపారు.. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయన్నారు.. కుంకీ ఏనుగులు కర్ణాటక అటవీ శాఖ దగ్గర ఉండడంతో కొన్ని కుంకీ ఏనుగులు ఏపీకి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖతో చర్చలు జరపడం జరిగిదన్నారు..ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రేతో చర్చలు ఆశించిన మేర జరిగాయన్నారు.. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎర్రచందనంను స్మగ్లింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకని దాదాపు రూ.140 విలువైన ఎర్రచందనం కర్ణాటలక ప్రభుత్వం సీజ్ చేయడం జరిగిందన్నారు..ఆర్దిక కష్టాల్లో వున్న ఆంధ్రప్రదేశ్ కు రూ.140 కోట్లు వేడినీళ్లకు చన్నీళ్లుగా పనికి వస్తాయని నవ్వుతు వ్యాఖ్యనించారు..రాబోయే రోజుల్లో తాను కన్నడ భాషా తప్పకుండా నేర్చుకుని,,కన్నడలోనే మాట్లాడుతానని అన్నారు..తొలుత ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు చేరుకున్న పవన్ కు, కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు..ఆ రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సుధీంద్ర,, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం తదితరులు ఇందులో వున్నారు..పర్యటనలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో మర్యాద పూర్యకంగా పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.