జపాన్ భారీ భూకంపం,రిక్టర్ స్కేలుపై 6.9,, 7.1గా నమోదు
సునామీ హెచ్చరికలు..
అమరావతి: భారీ భూకంపాలతో జపాన్ గురువారం విలవిలాడింది..నైరుతి దీవులైన క్యుషు, షికోకులో వెంట వెంటనే 6.9,, 7.1 తీవ్రతతో భారీ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి..ఈ ప్రకంపనల ధాటికి భారీ బిల్డింగ్‌లు,,రోడ్డు ప్రయాణించే వాహనాలు సైతం ఊగిపోయాయి..ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు..భారీ భూప్రకంపనల నేపథ్యంలో మియాజాకి, కొచ్చి, ఓయిటా, కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్‌లకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ NHK తెలిపింది..క్యుషులోని మియాజాకి ప్రిఫెక్చర్‌లో ఇప్పటికే 20 సెంటీమీటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడుతున్నాయి.. భారీ భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.. పలు చోట్ల భవనాలు కూలినట్లు వార్తలు వస్తున్నప్పటికి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. దక్షిణ జపాన్‌లోని మియాజాకి ప్రిఫెక్చర్‌లో మొదట 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.. USGS ప్రకారం, భూకంపం కేంద్రం సముద్రంలో 30 కిలోమీటర్ల లోతులో ఉన్నట్ల పేర్కొంది.. కొన్ని సెకన్ల తర్వాత, నిచినాన్ నగరానికి ఈశాన్యంగా 20 కి.మీ దూరంలో, 25 కి.మీ లోతులో 7.1 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.. జపాన్‌కు చెందిన భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ NERV ప్రకారం హ్యుగా-నాడా సముద్రంలో ప్రకంపనలు సంభవించినట్లు నివేదించింది.. భూకంపం ప్రభావంతో ఒక మీటర్ ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.. తీర ప్రాంతాలు, నదులు లేదా సరస్సుల సమీపంలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు..
https://x.com/i/status/1821462426786705875