68 క్రీడలకు స్పోర్ట్స్ రిజర్వేషన్ వర్తిస్తుంది-శాప్ ఛైర్మన్
నెల్లూరు: గతంలో 29 క్రీడలకు మాత్రమే స్పోర్ట్స్ రిజర్వేషన్ వర్తించేదని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్పోర్ట్స్ రిజర్వేషన్ 3 శాతం అమలుకు GO జారీ చేయడంతో 68 క్రీడలకు రిజర్వేషన్ వర్తిస్తుందని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు..ఆదివారం నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ను యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ కె.సునీతతో కలిసి పోటీలను శాప్ ఛైర్మన్ ప్రారంభించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాత పరీక్ష లేకుండా క్రీడాకారుల మెడల్స్, ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.. మెగా డీఎస్సీలో రాష్ట్రవ్యాప్తంగా 421 మంది క్రీడాకారులకు ఉద్యోగ భద్రత వుంటుందన్నారు.