దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని హిజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ భీకర దాడులు
అమరావతి: లెబనాన్‌కు చెందిన హిజ్‌బొల్లాపై స్థావరాలపై, ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఆదివారం ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దు ప్రాంతంలో భీకర దాడులు చేసింది.. ఈ అటాక్ ఆపరేషన్‌కు చెందిన వీడియోను ఇజ్రాయిల్ రక్షణ దళం రిలీజ్ చేసింది.. హిజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కేంద్రాలపై దాడి చేసినట్లు IDF తెలిపింది..తెల్లవారుజామున 5 గంటలకు దాడి ప్రారంభమైంది…ఈ దాడులు చేసేందుకు అమెరికాకు చెందిన అత్యంత అధునిక అటాక్ F35 అదిర్ జెట్స్ ఆకాశంలోనే ఫుయల్ నింపుకున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు..చాలా కచ్చితత్వంతో ఈ విమానాలను శత్రు టార్గెట్లను ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి..దక్షిణ లెబనాన్ ప్రాంతంలో వేలాది హిజ్‌బొల్లా మిస్సైళ్లను,, వందలాది యుద్ధ విమానాలు ధ్వంసం చేసిట్లు చెప్పారు.. అలాగే వేలాది షార్ట్ రేంజ్ రాకెట్లను తమ ఈ ఆపరేషన్ ద్వారా పేల్చివేసినట్లు ప్రధాని బెంజిమన్ నెతన్యహూ వెల్లడించారు.. ఇజ్రాయిల్‌లోని గలిలీ ప్రాంతంలోని పౌరులను హిజ్‌బొల్లా టార్గెట్ చేశారని,,అయితే ఆ దాడిని తిప్పికొట్టినట్లు నెతన్యహూ పేర్కొన్నారు.. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆ అటాక్ జరిగినట్లు నెతన్యహూ తెలిపారు.