పారిస్ ఒలింపిక్స్ క్రీడల ప్రారంభ వేడుకల్లో మెగాస్టార్
అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురుస్తున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ఆరంభమయ్యాయి.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీన్ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది..ఈ ప్రారంభ వేడుకల్లో పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు..తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.. ఒలింపిక్స్ వేడుకల ప్రారంభంలో పాల్గొన్నారు చిరంజీవి. ప్రపంచనలుమూలల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు ఈ వేడుకలు చూసేందుకు పారిస్ వెళ్లారు. వేడుకలకు సంబంధించిన మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్న ఫొటోను చిరు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు..భార్య సురేఖతో దిగిన ఫొటోను షేర్ చేశారు.. ఇందులో ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న చిరు,, ఆ ఫొటోను షేర్ చేస్తూ, ‘పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా ఆనందంగా ఉంది.. సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకోవడం సంతోషకరమైన క్షణం..ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్.. పతకాలు తీసుకురావాలని కోరుకుంటున్నా’అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ పేర్కొన్నారు.