అగష్టు 23వ తేదిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్న ప్రధాని మోదీ ?
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగష్టు 23వ తేదిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు..రష్యాతో యుద్ధం తరువాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లడం ఇదే తొలి సారి..ఈ పర్యటనకు సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయం ఇంకా స్పష్టతనివ్వలేదు..గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఇరువురు నేతలు కలిసిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై చర్చించారు..ప్రధాని మోదీ ఈ నెల 8వ తేదిన రష్యాలో రెండు రోజుల పాటు పర్యటించారు.. ఉక్రెయిన్‌పై 2022, ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభించింది.. మూడు వారాల్లో ఆ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించుకోవాలని పుతిన్ సైన్యం లక్ష్యంగా పెట్టుకున్నది..ఉక్రెయిన్‌కు నాటో దేశాల మద్దతుతో మూడు వారాలు అనుకున్న యుద్ధం రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది.. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి యుద్ధం మార్గం కాదని,, చర్చల తోనే శాంతి నెలకొంటుందని రష్యా,, ఉక్రెయిన్‌కు ప్రధాని మోదీ పలుమార్లు సూచించారు.