KNR High Schoolల్లో ప్రమాదంలో మరణించిన విద్యార్ది కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం-కలెక్టర్
నెల్లూరు: నగరం బీవీ నగర్ లోని చిన్న KNR High Schoolల్లో శుక్రవారం ప్రమాదవశాత్తు గోడ కూలి మరణించిన 9వ తరగతి విద్యార్థి మహేంద్ర కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు.శనివారం మంత్రి నారాయణ, విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు మాట్లాడుతూ పాఠశాల సమయం 4 గంటలు ముగిసిన తర్వాత జరిగిందని, పాఠశాలలో నిర్మాణంలో ఉన్న భవన లింటల్ లెవెల్ సన్ సైడ్ ప్రమాదవశాత్తు పడి విద్యార్థి మృతి చెందాడని తెలిపారు.
విద్యార్థి మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి-
నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మరణించారన్న విషయం తెలుసుకున్న రాష్ట్రమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్‌లో ఉన్న మంత్రి నారాయణకు ఆ సమయంలో అక్కడే ఉన్న మున్సిపల్ కమీషనర్ సూర్యతేజ..ఈ ప్రమాద విషయాన్ని తెలియజేశారు. పాఠశాలలో గోడ కూలి తొమ్మిదో తరగతి చదువుతున్న గురుమహేంద్ర(14)అనే విద్యార్థి మృతి దురదృష్టవశాత్తూ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని నెల్లూరు జిల్లా డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని హామీ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. శనివారం తాను నెల్లూరుకు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి… ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల చెక్కును అందించనున్నారు.