సంధ్య థియేటర్ సంఘటనలో మానవతా దృక్పథం లోపించింది-పవన్ కళ్యాణ్
అమరావతి: పుష్పా-2 ఫ్రీ రిలీజ్ సందర్బంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ జరిగిన సంఘటనలో గోటితో పోయే దాన్ని గొడ్టలి దాకా తెచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు..సోమవారం మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు..ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా చేశారని,,ఆడబిడ్డ చనిపోయారన్న బాధ అల్లు అర్జున్‌లో కూడా ఉందన్నారు..ఘటన జరిగిన రోజే లేదా ప్రక్క రోజున అల్లు అర్జున్ తరఫున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని,,వివాదం ఇంత దూరం వచ్చేది కాదన్నారు..ఈ సంఘటనలో మానవతా దృక్పథం లోపించిందన్నారు..ఈ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలచివేసిందని అన్నారు.. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని చెప్పారు..హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారని,, అల్లు అర్జున్ విషయంలో ముందూ,, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు..ఈ విషయంలో సంధ్య థియేటర్ సిబ్బంది అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని పవన్ వ్యాఖ్యానించారు..ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ పట్ల జగన్ మోహన్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి వ్యవహరించలేదన్నారు..బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారని,,చట్టం ఎవరికీ చుట్టం కాదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు..సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారన్న పవన్ కల్యాణ్,, పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ వ్యాఖ్యనించారు.