తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్లో కూలిన సీలింగ్
తిరుపతి: తిరుపతిలోని రేణిగుంట రోడ్డులో వున్న మినర్వా గ్రాండ్ హోటల్ లోని 314 నంబరు గదిలో సీలింగ్ కూలడంతో కస్టమర్స్లు భయంతో హోటల్ బయటకు పరుగులు తీశారు..సోమవారం ఆర్దరాత్రి పైకప్పు కూలిన గదితో పాటు హోటల్ బస చేసిన యాత్రికులు అందరూ హోటల్ నుంచి బయటకు వచ్చారు.. ప్రమాదం ఘటనపై హోటల్ సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు.. ఘటనాస్థలికి పోలీసు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని కస్టమర్స్లును సురక్షిత ప్రాంతాలకు తరలించారు..హోటల్ని సీజ్ చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు మినర్వా గ్రాండ్ హోటల్‌లో తనిఖీలు చేపట్టారు..హోటల్ మినర్వా భవనం పరిస్థితిపై ఆరా తీసిన అధికారులు గది సీలింగ్ కూలిన ఘటనపై వివరాలు సేకరించారు.