ఏటూరు నాగారంలో భారీ ఎన్‌కౌంటర్-7 మావోయిస్టులు మృతి
హైదరాబాద్: ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్,, మావోయిస్టుల మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మరణిందారు..తెలంగాణ గ్రేహౌండ్స్,, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి..ఈ ఎన్‌కౌంటర్‌పై పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు.. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం..ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35)తోపాటు అతని దళ సభ్యులు ఉన్నట్లు తెలుస్తొంది.. ఏటూరునాగారం మహదేశ్‌పూర్ కార్యదర్శి ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్ (23)లు మృతిచెందినవారిలో ఉన్నారు.. సంఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్,, పెద్ద మొత్తం ఆయుధాలను గ్రేహౌండ్స్ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం..దాదాపు 14 సంవత్సరాల తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదే కావడం గమనర్హం.