AP&TG

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ర్టేషన్ విలువలు పెంపు-రెవెన్యూ మంత్రి

అమరావతి: రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ర్టేషన్ విలువలు పెరుగుతున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు..రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో రెవెన్యూ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ర్టేషన్ విలువలు పెంచుతున్నట్లు చెప్పారు.. సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు రిజిస్ర్టేషన్ చార్జీలు పెరుగుతాయని తెలిపారు.. జనవరి 15వ తేది నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.. మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ర్టేషన్ విలువలను తగ్గించబోతున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో పెంపుదల, తగ్గింపు కానీ ఉండదని స్పష్టం చేశారు.. వైసీపీ ప్రభుత్వం శాస్ర్తీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్ర్టేషన్ విలువలను పెంచిందని,, వాటిని సరి చేస్తామని తెలిపారు.. రెవెన్యూ గ్రీవెన్సులలో వచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టమని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.. గ్రోత్ కారిడార్ల ఆధారంగా ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టామని,,జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా భూములను గుర్తిస్తామని తెలిపారు.. కమిటీ సిఫారసులు, గ్రోత్ కారిడార్ల అధ్యయనం ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు.. 200 మంది డిజిటల్ అసిస్టెంట్‌లను రిజిస్ట్రేషన్ విధానంలో వినియోగిస్తామన్నారు..ఇప్పటికే రూ.6200 కోట్లు రెవెన్యూ శాఖలో ఆదాయం ఉందని,, మార్చి నాటికి రూ.10వేల కోట్లు దాటే అవకాశం ఉందని తెలిపారు.. ఇప్పటికీ రూ.120 కోట్ల వరకూ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగిందని చెప్పారు.. రీసర్వే వల్ల వచ్చిన నష్టాల పైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు..రూ.198 కోట్లు రీసర్వే ఇన్సెంటివ్ వచ్చిందని,, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో కార్యాలయాల పునరుద్ధరణకు వినియోగిస్తామని,,596 జీఓ‌తో డీవియేషన్‌లు కొట్టేస్తామన్నారు.. అధికారి ఎవరు ఏ స్ధాయిలో భూ సమస్యల్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *