AGRICULTUREAP&TGOTHERS

పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ప్రజలకు మంచి చేయాలి అనే సంకల్పం రాజయకీయ నాయకుల్లో వుంటే,,రాష్ట్రలకు కేంద్రప్రభుత్వం ఇస్తూన్న అధ్భతమైన పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో..డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నారు..

అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో రూ.1.85 లక్షల వ్యయంతో పిఠాపురం నియోజకవర్గం, కుమారపురంలో నిర్మించిన మినీ గోకులాన్ని శుక్రవారం ప్రారంభించి నాలుగు గోవులను రైతు, నాగేశ్వరరావుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందజేశారు.. ఇదే వేదిక నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో భారీ సంఖ్యలో గోకులాల నిర్మాణం పూర్తి చేసి రికార్డు సృష్టించారు. శాస్త్రోక్తంగా కుమారపురం మినీ గోకులాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్, గోమాతను పూజించి, పశుగ్రాసాన్ని అందించారు. అనంతరం గోకులం నిర్మాణ శైలిని పరిశీలించారు. గోకులం షెడ్లలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అందిస్తున్న సదుపాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. పశువులకు అందిస్తున్న దాణా, అందుబాటులో ఉన్న పశుగ్రాసం వంగడాలు, పశుగణాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఈ చిత్ర ప్రదర్శన ద్వారా క్షుణ్నంగా అధ్యయనం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన పోస్టర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ ఉదయ్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *