తెలుగు సినిమా పరిశ్రమపై సీ.ఎం కక్ష్య కట్టారా? అబ్బే అదేం లేదు-దిల్ రాజు
సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ…
అమరావతి: పుష్పా-2 సినిమా విడుదల సందర్బంగా సంధ్య థియేటర్ చోటు చేసుకున్న సంఘటన అనంతరం తొలి సారి గురువారం సినీ పెద్దలు FDC చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం అయ్యారు..సమావేశం అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదని,, ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది మా ముందున్న అతి పెద్ద లక్ష్యమని దిల్ రాజు వివరించారు..ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామని తెలిపారు.. ప్రభుత్వం,, సినీ పెద్దలతో త్వరలోనే ఈ అంశంపై కమిటీ వేస్తామన్నారు..పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది అనేది కేవలం అపోహ మాత్రమే అన్నారు..త్వరలోనే మరోసారి సీఎంతో భేటీ అవుతామని చెప్పారు..
ఈ భేటీలో టికెట్ ధరల పెంపు,,బెనిఫిట్ షోలు,, అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చాయా?
( తెలుగు సినీమా పరిశ్రమపై తెలంగాణ సీ.ఎం రేవంత్ రెడ్డి,,కక్ష్యకట్టినట్లు వ్యవహారిస్తున్నారని,,హీరో నాగార్జున కన్వక్షన్ సెంటర్ కూల్చివేత నుంచి అల్లు.ఆర్జున్ అరెస్ట్ వంటి వ్యవహారం వరకు ఈ ధొరణ ప్రస్పుటంగా కన్పిస్తొందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.. పుష్పా-2 సినిమా విడుదల సందర్బంగా సంధ్య థియేటర్ చోటు చేసుకున్న సంఘటన దురదృష్టకరం…అయితే రాజకీయ నాయకులు నిర్వహించే బహిరంగ సభల్లో ప్రజలు పాల్గొన్న సందర్బంల్లో జరిగే తొక్కిసలటాలో,, ఉత్సవాలు జరిగే సమయంలో చోటు చేసుకునే మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అనే విషయం తెలంగాణ సీ.ఎం మర్చిపోయారా అనే ప్రశ్నలను విమర్శకులు లెవనెత్తుతున్నారు.. అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు,,వారి పార్టీలు,,ఉత్సవాల నిర్వహకులు,, బాధిత కుటుంబాలకు, తుతూ మంత్రంగా లక్ష లేక రెండు లక్షలో ప్రకటించి,చేతులు దూలిపేసుకుంటారు..మరి అలాంటి వారిపై చర్యలు ఎవరు తీసుకుంటారు ? ఏ ఏ సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేస్తారు ?. సీ.ఎం రేవంత్,,సినిమా పరిశ్రమ పెద్దల మెడలు వంచి,రాబోయే రోజుల్లో తమ పార్టీకి అవసరమైన ఆర్ధిక నిధులను సమకూర్చేందుకు,,ఈ వ్యూహాం అనుసరిస్తన్నారా అనే విషయం కూడ ఉత్పన్నం అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు..తర్వలో తెలుగు సినిమా పరిశ్రలో ఎటుంవంటి పరిమాణాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి ?………)
ప్రభుత్వ ప్రతిపాదనలు..
1-ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినిమా ఇండస్ట్రీ సహకరించాలి…2-డ్రగ్స్ కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలి..3-డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో హీరోలు, హీరోయిన్లు కచ్చితంగా పాల్గొనాలి..4-సినిమా టికెట్లపై విధించే సెస్సును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెట్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి..5-కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి తారలు సహకరించాలి..6-బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని సీ.ఎం స్పష్టం చేసినట్లు సమాచారం?