పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్-ఎస్పీ
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేసిన పొట్టపాశం.రఘు@పుష్పరాజ్‌ను అరెస్ట్ చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు..బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ,, మార్క్ శంకర్ లక్ష్యంగా పెట్టిన పోస్ట్ లపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి,,దర్యాప్తు చేపట్టామని,,ఈ పోస్టులు పెట్టిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన రఘు@పుష్పరాజ్‌గా గుర్తించి,,అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు..అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వార్‌లో భాగంగా అతడు ఈ పోస్ట్ చేశారని వెల్లడించారు..అల్లు అర్జున్‌కు మద్దతుగా మెగా కుటుంబంపై రఘు అలియాస్ పుష్పరాజ్ ద్వేషం పెంచుకున్నాడని తెలిపారు..ఇతను గతంలో మహిళలపై కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ చేశాడని చెప్పారు…. రఘు@పుష్పరాజ్‌ను కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.