వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీమ్ కోర్టు
రేపు మధ్యంతర తీర్పు..
అమరావతి: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది..వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి..పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు..
వక్ఫ్ బోర్డు సవరణ చట్టంను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ముందే తమ వాదనలు కూడా వినాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.. పిటిషన్లు దాఖలు చేసిన రాష్ట్రాల్లో అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి..ఈ రాష్ట్రాలు ఈ చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..
హిందువులకు సంబంధించిన వారసత్వ విషయాల్లో కూడా ప్రభుత్వం చట్టం చేసిందని,,ముస్లిం సమాజం కోసం కూడా పార్లమెంట్ చట్టం చేసింది కదా? ఇందులో తప్పేముందని సిజెఐ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.. ఆర్టికల్ 26 అనేది సెక్యులర్ అనే ఆర్దం ఇస్తుందని,,ఇది అన్ని మతాలకు వర్తిస్తుందని సిజెఐ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు.. వాదనలు విన్న అత్యున్నత న్యాయ స్థానం, ఈ వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.. రేపు మధ్యంతర తీర్పు ఇస్తామని చెప్పింది.