ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన డొనాల్డ్ ట్రంప్
అమరావతి: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ అయిన 270ను దాటేశారు..దింతో అయన గెలుపు ఖయం అయింది..ఈ సందర్బంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో తన మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..ఇది అమెరికన్లు గర్వించే విజయమని,,ఈ విజయం తమ దేశం కోలుకునేందుకు దోహదపడుతుందని అన్నారు..అమెరికన్ల కోసం,,మీ కుటుంబం,,మీ భవిష్యత్తు కోసం ప్రతిరోజూ పోరాడతాను అని,,సురక్షితమైన,, సంపన్నమైన అమెరికాను అందించే వరకు నేను విశ్రమించను అని చెప్పారు..ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు బాగాపోరాడారని,,రిపబ్లికన్ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ:- అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో ప్రస్తుతం వున్న ట్రెండ్ ప్రకారం.. ట్రంప్ మెజారిటీ మార్క్ 270 ఓట్లను దాటేశారు.. దీంతో ట్రంప్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు..చరిత్రాత్మక విజయం పొందిన నా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.