VBR హైస్కూల్ 10వ తరగతి విద్యార్ది ప్రణీత్ ఆత్యహాత్య
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ధనలక్ష్మిపురంలోని VBR హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ప్రణీత్ రెడ్డి హాస్టల్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..ముత్తుకూరు ఆర్.ఆర్ కాలనీ నివాసం వుంటున్న ప్రణీత్ తల్లి,తండ్రులు,చదువుల్లో పెద్దగా రాణించలేని,,అతన్ని VBR హైస్కూల్ హస్టల్ చేర్పించాడు.. బుధవారం మధ్యహ్నం లంచ్ టైమ్ లో స్నేహితులు డైనింగ్ హాల్ కు వెళ్లుతుండగా తాను బట్టలు ఆరవేసి వస్తానని చెప్పి,రూమ్ లోనే వుండి పోయాడు..తాను చదువుల్లో రాణించ లేనంటూ,సూసైడ్ నోట్ రాసి పెట్టి,,బట్టలు ఆరవేసే నైలాన్ తాడుతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు..ఎంతకి ప్రణిత్ భోజనంకు రాకపోవడంతో స్కూల్ సిబ్బంది రూమ్ వద్ద వెళ్లె సరికి ఈ ఘటన కన్పించింది..వెంటనే ప్రణీత్ ను చికిత్స నిమిత్తం స్కూల్ యాజమాన్యం నారాయణ హాస్పిటల్ తరలించింది..ప్రణీత్ సూసైడ్ చేసుకున్నాడని స్కూల్ సిబ్బంది,ప్రణీత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు..వైద్య పరీక్షలు చేసిన నారాయణ వైద్య సిబ్బంది ప్రణీత్ మృతి చెందాడని నిర్ధారించారు..తన కుమారుడు ఆత్యహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ప్రణీత్ మృతి పై అనుమానం వ్యక్తం చేస్తు, ప్రణీత్ తల్లి కన్నీంటి పర్యాంతంగా తెలిపింది..సంఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు స్కూల్ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు.