రోడ్డు ఆక్రమణలపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం-కమిషనర్ సూర్యతేజ
నిజంగా జరుగుతుందా ?
(కొత్తగా బాధ్యతలు తీసుకున్న మునిసిపాల్ కమీషనర్లు చెప్పె మొదటి మాట రోడ్డు ఆక్రమణలపై జారిమానాలతో కూడిన కఠిన చర్యలు తీసుకుంటాం,,ట్రాఫిక్ కు అంతరాయం కల్పిస్తే చర్యలు తప్పవు..ఈ మాటలు విని విని నగర వాసులకు విసుగు వచ్చేసింది..నిజంగా ట్రాఫిక్ సాఫిగా జరగాలంటే,ముందు కూరగాయాల మార్కెట్ వద్ద రోడ్డును ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న వారిని అదుపు చేయాలి..రోడ్డుపైన వ్యాపారం చేసుకునే వారి వద్ద నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన సిబ్బంది అంటూ ప్రతి రోజు రూ.40 వసూలు చేసి రశీదు ఇస్తున్నారు..దినికి అధికారులు ఏం సమాధానం చెపుతారో? రోడ్డుపైన అడ్డంగా పార్కింగ్ చేసే వారిని కంట్రోల్ చేసే ట్రాఫిక్ కానిస్టేబుల్ అనే వ్యక్తే కన్పించడు..ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన కమీషనర్,,రోడ్డుపైన అడ్డంగా పడుకునే అవులను ఇంత వరకు అదుపు చేయలేక పోయాడు..పోలీసులు,,రవాణ అధికారులతో కార్పొరేషన్ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించ కుండా నగరంలో ట్రాఫిక్ చక్కదిదుతాం అంటే ? నగర ప్రజలు ఏ విధంగా చూస్తారో ??)
నెల్లూరు: పాదాచారులు, వాహన చోదకులకు అడ్డంకిగా మారి ట్రాఫిక్ అంతరాయాలకు కారణమవుతోన్న రోడ్డు ఆక్రమణలపై జారిమానాలతో కూడిన కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా గురువారం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నుంచి సిరి మల్టీప్లెక్స్, అర్చన సినిమా హాలు మార్గంలో ఏసీ కూడలి వరకు అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ కూడళ్లలోని ఐ ల్యాండ్ లను, డివైడర్లను పరిశీలించిన కమిషనర్, వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి పచ్చదనం పెంచాలని సూచించారు.
ఫుట్ పాత్ లపై ఏలాంటి వాణిజ్య, వ్యాపార సైన్ బోర్డులు పెట్టవద్దని దుకాణదారులకు తెలియజేసి వాటిని తొలగించారు. నగర వ్యాప్తంగా ఫుట్ పాత్ లను పరిశీలించి ఆక్రమణలపై జరిమానాలు విధించాలని ఆదేశించారు. నగరంలోని అన్ని రోడ్లపై ఉన్న భవన నిర్మాణ సామాగ్రి ఆక్రమణలను తొలగించేలా యజమానులకు నోటీసుల ద్వారా తెలియజేయాలని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కమిషనర్ ఆదేశించారు.
నగర పాలక సంస్థ సూచించిన ప్రమాణాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఏ.సి కూడలి సమీపంలోని బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయించడం, వ్యర్ధాలను రోడ్లపై వేయడాన్ని గమనించిన కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.
ఈ కార్య్రక్రమంలో ఇంజనీరింగ్ ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ.లు సంజయ్, చంద్రయ్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ దేవీ కుమారీ, టి.పి.ఓ.ప్రకాష్, డి. ఈ.ఈ.అనిల్,,రెవెన్యూ అధికారి సమద్, ఇంజనీరింగ్ , ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.