నెల్లూరులోని బలిజ(కాపు) భవన్‌లో విద్యార్థులకు పురస్కారాలు అందిజేసిన మంత్రి నారాయణ
104 మంది విద్యార్థులు..
నెల్లూరు: పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు టీడీపీ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు..ఆదివారం నెల్లూరు నగరంలోని బలిజ (కాపు) భవన్‌లో డాక్టర్ పోకల.రవి సహకారంతో బలిజ మెరిట్ విద్యార్థులకు పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు..ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ డాక్టర్ రవి సహకారంతో 104 మంది బలిజ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్యేశంతో రూ.4.80 లక్షల నిధులు అందజేయడం అభినందనీయమన్నారు..టీడీపీ హయాంలో కాపు భావానికి అన్ని హంగులు తెచ్చామన్నారు. అయితే ఈ భవనాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సారిగా కాపు బలిజ భవనంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ భవనంలో పేద విద్యార్థులకు పురస్కారాలు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కాపు,బలిజ భవన్‌లో మిగిలిన పనులన్నీ పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ మాటిచ్చారు.