తల్లికి,చెల్లికి తేడా తెలియని మత్తులో వున్నారా-హోంశాఖ మంత్రి అనిత
తిరుపతి: తిరుపతి జిల్లా, వడమాల పేట ,అఘాయిత్యానికి గురై హత్య చేయబడిన చిన్నారి(3) తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేసి,,చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి హోంశాఖ మంత్రి అనిత ధైర్యం చెప్పారు..నిందితుడికి 2 నుండి 3 నెలల్లో కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని పాప తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు..ముఖ్యమంత్రి ఇలాంటి హత్యాచారాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు..(సంఘటన జరిగింది ఇలా…)
వడమాల పేట, అలివేలు మంగాపురం, ఎస్టీ కాలనీలో శుక్రవారం (3) చిన్నారికి చాక్లెట్లు కొన్నిస్తానని ఆశ చూపి,అదే గ్రామంకు చెందిన సుశాంత్ (22),,పాపను పొలాల్లోకి తీసుకుని వెళ్లి ఆత్యాచారం చేసి,తరువాత చంపివేసి,అక్కడే పూడ్చిపెట్టాడు..సాయంత్రం అవుతున్న తన బిడ్డ ఇంటికి రాకపోడంతో అమె తల్లి,వడమాపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది..అదే సమయంలో సుశాంత్ పై పాప తల్లి అనుమానం వ్యక్తం చేసింది.శుక్రవారం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెంటనే స్పందించి స్థానిక పోలీసులను ఫిర్యాదు వచ్చిన గ్రామంకు పంపించాడు..పోలీసులు సుశాంత్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా,,అతను చేసిన ఘోరంను ఒప్పుకుని,చిన్నారిని పూడ్చిపెట్టిని ప్రదేశంను చూపించాడు..ఈ ఘటనపై స్పందించిన సీ.ఎం చంద్రబాబు చిన్నారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేయడంతో పాటు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు..ఆదివారం హోం మంత్రి అనిత,పాప తల్లి,తండ్రులను పరామర్శించి,వారికి చెక్కును అందచేయడంతో పాటు వారికి ప్రభుత్వం తరపును ఇళ్లును నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు.