వైద్యారోగ్యశాఖలో జరిగిన ఫోర్జరీ సంఘటనలపై చట్ట ప్రకారం చర్యలు-మంత్రి నారాయణ
నెల్లూరు: ప్రత్యేకoగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని, కేవలం మొక్కుబడిగా అర్జీలు స్వీకరించడం కాకుండా అవకాశం ఉన్నంత మేరకు ఆయా అర్జీలకు తక్షణ పరిష్కారం చూపుతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు..శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో కలసి మంత్రి నారాయణ నిర్వహించారు.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సమస్య తీవ్రతను బట్టి కొన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపుతున్నామని, రాష్ట్రస్థాయిలో పరిష్కారమయ్యే దరఖాస్తులను అక్కడికి పంపడం జరుగుతుందన్నారు. ఎక్కువగా రెవిన్యూ పరమైన సమస్యలు వస్తున్నాయన్నారు. అస్తవ్యస్తమైన పాలనను గాడిలో పెట్టి ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపి నిజమైన ప్రజా పరిపాలనకు నాంది పలుకుతామన్నారు. జగనన్న లేఅవుట్ లలో జరిగిన అక్రమాలపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని, అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్యాలయం, జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం లో జరిగిన ఫోర్జరీ సంఘటనలపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పాత్రికేయుల ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ ఇ కృష్ణమోహన్, డిపిఓ సుస్మిత, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శర్మద, డీఈవో రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.