AP&TG

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నిధులు పెంచిన డిప్యూటివ్ సీ.ఎం పవన్ కల్యాణ్

అమరావతి: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామగ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటివ్ సీ.ఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు..వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచుతున్నట్టు వెల్లడించారు..ఆగష్టు 15వ తేది స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలకు ప్రస్తుతం అధికారికంగా గ్రామాలకు ఇస్తున్న రూ.100,, రూ.250 మొత్తాలను రూ.10 వేలు,,రూ.25 వేలకు పెంచుతున్నట్టు శుక్రవారం కీలక ప్రకటన వెలువడింది..ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం నాటి కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు రూ.100,, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5 వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందిస్తాం’’ అని పవన్ కల్యాణ్ వివరించారు..

ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలసిన పలువురు సర్పంచులు, స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని తెలిపారు..జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు..ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నదీ తెలియచేయాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు.. గత 34 ఏళ్లుగా రూ.100, రూ.250 చొప్పునే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు..ఆ స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదని,, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని అధికారులను అదేశించారు..దింతో ఆ మేరకు రూ.10 వేలు, రూ.25 వేలు అందజేయాలని నిర్ణయించారు..పంచాయతీల అధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. జాతీయ పండుగలైన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహించాలని సూచించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *