DISTRICTSEDU&JOBSOTHERS

తిరుపతి లోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్యు డి ఆర్ డి ఎ* Job Mela at SV Polytechnic College, Tirupatiసంయుక్త ఆధ్వర్యంలో    తిరుపతి లోని  ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల(SV Polytechnic College,Tirupati)నందు 27-12- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును.
జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: SV Polytechnic College,Opp TTD Administration Building,KT Road,Tirupati, Tirupati Dist.

ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అరబిందో ఫార్మా, భార్గవి ఆటోమొబైల్స్ ,ఫోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్   మొదలగు కంపెనీలలో  ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.
విద్యార్హతలు: 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా బీటెక్ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్త అయిన యువతీ యువకులు  అర్హులు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు  ఆధార్ కార్డు జిరాక్స్ మరియు విద్యార్హత సంబందించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు బయోడేటా ఫామ్ తో  పాటు  క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా   నమోదు చేసుకొని కచ్చితంగా *అడ్మిట్ కార్డు  తో  జాబ్ మేళాకు హాజరవ్వవలెను* అని ఆర్ లోకనాథం గారు, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి తిరుపతి జిల్లా మరియు  ద్వారకనాథ రెడ్డి గారు, ప్రిన్సిపాల్,  ఎస్ వి పాలిటెక్నిక్  కళాశాల వారు సంయుక్తంగా   ఒక ప్రకటనలో తెలియజేశారు.

రిజిస్ట్రేషన్ లింకు:https://naipunyam.ap.gov.in/

మరిన్ని వివరములకు  8143576866 మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.

గమనిక: జబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు)  హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి R.లోకనాథం  కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *