జిల్లాలో 10 వేల ప్రాంతాల్లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు-కలెక్టర్
నెల్లూరు: జిల్లాలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు.బుధవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణమ్మ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి 10వేల ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు.జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణ,వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డ్ లకు తరలించడం తదితర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నా.స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలు తీసుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఇఓ కె.కన్నమనాయుడు, డిప్యూటీవ్ సి.ఇ. ఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.