స్థానిక సమస్యలను నగర పాలక సంస్థ దృష్టికి తీసుకుని రండి- కమిషనర్ సూర్యతేజ
94940 18118, 0861-2356777..
నెల్లూరు: నగరపాలక సంస్థకు సంబంధించిన పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర స్థానిక సమస్యలను కార్పొరేషన్ కార్యాలయం దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, పై సమస్యల కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేక విభాగమును ఏర్పాటు చేశామని కమిషనర్ సూర్యతేజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను 94940 18118 నెంబరుకు వాట్సప్ ద్వారా లేదా 0861-2356777 & 0861-2316777 హెల్ప్ లైన్ నెంబర్లకు ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల లోపు సమస్యలను తెలియజేయాలని కోరారు. అందుకున్న ఫిర్యాదులను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియచేసి తక్షణమే సదరు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు.
మొక్కల పెంపకాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా చేపట్టండి:- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక 20 వ డివిజన్ కావేరి నగర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతంతో పాటు 13 వ డివిజన్ జగదీష్ నగర్ మున్సిపల్ పార్కు ప్రాంగణంలో బుధవారం మొక్కలు నాటారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ హాజరై “ఏక్ పేడ్ మాకే నామ్” అనే అంశంపై రూపొందించిన అవగాహనా కార్యక్రమం విశిష్టతను, నగర వ్యాప్తంగా మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు.