AP&TG

నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తాం-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక విషయలు చర్చకు వచ్చాయి..కూటమి నేతలు,, రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చ లేవనెత్తారు., కొంతమంది వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఉపముఖ్యమంత్రి పవన్ తీసుకుని వచ్చారు.. ఇంట్లో ఉన్న ఆడవాళ్లనూ వదిలిపెట్టకుండా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని,, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు..ఇప్పటికి కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంత మంది అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో ఉన్నారని,, ఇలాంటి పరిస్థితులు ఉంటే నిందితులను శిక్షించేదేలా అని ఆయన ప్రశ్నించారు.. సమస్యలు వచ్చినప్పుడు కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఉప ముఖ్యమంత్రి మండిపడ్డారు.. కిందిస్థాయిలో ఉన్న డీఎస్పీలు,, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..ఇంట్లో ఉన్న ఆడవాళ్లపైనా పోస్టులు పెడితే చూస్తూ ఎలా ఊరుకుంటాం అందుకే తాను రియాక్ట్ అయ్యానని సీఎంకు తెలిపారు..ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, గత ప్రభుత్వం వల్లే రాష్ట్ర పోలీసులు ఇలా తయారయ్యారని చంద్రబాబు అన్నారు.. వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రికి చెప్పారు..కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారనీ ఫిర్యాదులు వచ్చాయని,,నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు చెప్పారు.. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిద్దామని,,ఇకపై సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.. సీఎం చంద్రబాబు మాటలకు రియాక్టయిన పవన్ కల్యాణ్,, పోలీస్ డిపార్ట్మెంట్‌లో కొంతమంది అవినీతిపరులూ ఉన్నారని,,కొన్ని కేసులు గురించి సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదని సీఎం దృష్టికి ఆయన తీసుకెళ్లారు.. ఎస్పీలు సీరియస్‌గా పని చేయడం లేదని,,అందరినీ దారిలోకి తీసుకువస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *