ముంబై, థానే, నాసిక్‌లలో భారీ వర్షాలు-రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
అమరావతి: మహారాష్ట్ర రాజధాని ముంబైతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. బుధవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి..థానే, నాసిక్‌లలో ఆరెంజ్ అలర్ట్,, ముంబైతో పాటు పలు ప్రాంతాలకు గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది..వర్షం కారణంగా ఏర్పడే సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ముంబై, పూణే, పింప్రి-చించ్వాడ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను గురువారం మూసివేయాలని ఆదేశాలు ఆదేశాలు చేశారు..అవసరమైనప్పుడు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని పోలీసు యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.