జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి 5 సం… ఆప్రమత్తమైన ఆర్మీ
అమరావతి: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించి నేటికి 5 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.. 2019 ఆగస్టు 5వ తేదిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది..ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటోంది..ఇటీవలి చోటు చేసుకుంటున్న వరుస ఉగ్రఘటనలాంటివి జరగకుండా భద్రతాబలగాలను ఆప్రమత్తం చేశారు.. సైనికుల కాన్వాయ్‌లపై దాడి జరిగేందుకు అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారం మేరకు వాటి రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు సంబంధిత అధికారులు వర్గాలు పేర్కొన్నాయి..ఇదే సమయంలో అమర్‌నాథ్ యాత్ర వాహనాలకు కూడా ఇవే ఆంక్షలు ఉంటాయని తెలిపారు.. సరిహద్దుల నుంచి చొరబాట్లు,, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు భద్రతను మరింత పెంచారు.. సోమవారం ఉదయం నియంత్రణ రేఖ సమీపంలోని అఖ్నూర్, సుందర్‌బనీ సెక్టార్ల వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించిన పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ,గాల్లో వార్నింగ్ షాట్స్ ను పేల్చి,,ఆ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.