ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించినట్లు సమాచారం.. ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి,,రాష్ట్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు తెలుస్తొంది.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత,,ప్రధానితో పవన్ భేటీ కావడం ఇదే తొలిసారి.. ప్రధానమంత్రి మోదీతో సమావేశానికి ముందు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు..పవన్ వెంట ఎంపీలు వల్లభనేని బాలశౌరి,,ఉదయ శ్రీనివాస్‌లు ఉన్నారు.. పార్లమెంట్ భవనంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు,, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని పవన్ మర్యాద పూర్వకంగా కలిశారు.