రాష్ట్ర పర్యాటక రంగానికి రూ.113.751 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం-మంత్రి దుర్గేష్
అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కిపథకం క్రింద -2024-25 సంవత్సరానికి గాను తొలి విడతగా రూ.113.751 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.. నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.. తొలి విడత నిధులు ఖర్చు చేసిన తరువాత తదుపరి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిందన్నారు.. సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి,, గండికోటను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అలాగే సంబంధిత ప్రాంతాల్లో మౌలిక వసతులు,, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు..కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులతో పాటు జాతీయ,,అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు.. పర్యాటకాంధ్రప్రదేశ్ కు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు..ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి త్వరితగతిన నిధులు విడుదలకు చొరవ చూపించడంపై కృతజ్ఞతలు తెలిపారు..గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఆచరణలో చేసి చూపిస్తామన్నారు.