సముద్రంలో చిక్కున్న మత్స్యకారులను సురక్షితంగా కృష్ణపట్నం పోర్ట్ కు చేర్చిన అధికారులు
తిరుపతి: అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుఫాన్ తీవ్రతరం అవుతుందని,మత్స్యకారులను సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళరాదని ప్రభుత్వం హెచ్చరించిన, నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మందిమత్స్యకారులు మెకనైజేడ్ బోట్ తో మంగళవారం వేటకు సముద్రంలోకి వెళ్లారు.. సముద్రంలోనికి వెళ్లిన తరువాత వాకాడు మండలంలోని వడపాలెం, వై.టి.కుప్పానికి సముద్రంలో 14 కిలో మీటర్ల దూరంలో,, బోట్ ఇంజను పాడైపోయింది..దింతో బోట్ లోని జాలర్లు,,మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ వారికి తెలుపారు.. సత్వరమే స్పందించిన కలెక్టర్,, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించారు..నేవీ-కోస్ట్ గార్డ్ అధికారులు వెంటనే పెద్ద పడవల సహాయముతో దుగ్గరాజపట్నం వద్ద చిక్కుకుపోయిన IND TN 02 MM2588 బోట్‌తో పాటు బోగోలు మండలం పాతపాలెం, చెన్నరాయునిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులను సురక్షితంగా బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణపట్నం చేర్చారు.. మత్స్యకారులు వెంటనే స్పందించి తమను కాపాడిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
రెస్క్యూ చేయబడిన మత్స్యకారుల వివరాలు:- 1.సీహెచ్.రమేష్, 2. కె. ఏడుకొండలు,3.కె.చిట్టిబాబు,4. కె.తిరుపతి,5. వి.హరి బాబు 6.వై.అరవండి,7.కె.వెంకట రమణయ్య,8. సి.హెచ్ శివాజీ,9. ఎ.తిరుపతి.