ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి-M.H.O చైతన్య
నెల్లూరు: నగరవ్యాప్తంగా నిర్వహణలో లేని ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆదేశించారు. నగరంలో నిర్వహణలో లేని స్థలాలలో వర్షపునీరు చేరిపోయి దోమలు విపరీతంగా పెరిగేందుకు ఆస్కారం ఉందని,,దోమల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని ఆదేశించారు. డ్రైను కాలవల పూడిగతీతకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించి పారుదల సజావుగా జరిగేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని డ్రైను కాలువలకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని ఇంజనీరింగ్ విభాగం వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అశోక్, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.