రాజ్యాంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం-ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రముఖుల చిత్రాలు,చరిత్రతో వినూత్నంగా…
అమరావతి: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన కేలండర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉండవల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు.. కేలండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తుచేశారు. ‘సైమన్ గో బ్యాక్’ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాంతంత్ర్య ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి అన్నారు.. టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయసహకారాలు అందించారని కీర్తించారు..అలాగే భోగరాజు పట్టాభిసీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, ఢిల్లీలో పరిపాలన-శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి చెప్పారు..ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘు రామకృష్ణ రాజు, రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర పాల్గొన్నారు.